తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) వనపర్తిలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా స్థానిక శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపండితులు ఆశ్వీరచనం అందించి.. స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయంలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి వెంట మంత్రి దామోదర రాజనర్సింహ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు.