జిమ్‌లో వర్కౌంట్ చేస్తుండగా ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) గాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో పాటు వివిధ పార్టీల ప్రముఖులు పోస్టులు చేస్తున్నారు.
కేటీఆర్ త్వరగా కోలుకుని తిరిగి మంచి ఆరోగ్యం, బలాన్ని పొందాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నానని ఎక్స్ వేదికగా కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) తెలిపారు.
సోదరుడు కేటీఆర్ త్వరగా కోలుకోవాలని వైద్యుల సూచనలకు అనుగుణంగా తగిన విశ్రాంతి తీసుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూడా ఎక్స్ వేదికగా సూచించారు.
‘ఆత్మీయులు కేటీఆర్‌కు గాయమైన సంగతి తెలిసి బాధపడ్డాను. వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుని, త్వరగా కోలుకోవాలని’ ఏపీ మంత్రి నారా లోకేశ్ (Lokesh) ఆకాంక్షించారు.
కేటీఆర్ త్వరగా కోలుకోవాలంటూ ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan) ట్వీట్ చేశారు. ఈ పోస్టులపై స్పందించిన కేటీఆర్ అందరికీ ధన్యవాదాలు తెలిపారు.