Friday, April 11, 2025
HomeతెలంగాణPatancheru: బోనమెత్తిన గవర్నర్ తమిళిసై

Patancheru: బోనమెత్తిన గవర్నర్ తమిళిసై

పటాన్ చెరు పట్టణంలో మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ నిర్వహించిన ఎల్లమ్మ బోనాల పండుకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై హాజరయ్యారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైన బోనాన్ని గవర్నర్ తమిళిసై ఎత్తుకొని అమ్మవారికి సమర్పించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎల్లమ్మ బోనాల పండుగకు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ కేంద్ర కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ తో కలిసి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల ప్రతీకైనా బోనాల కార్యక్రమాన్ని గవర్నర్ తమిళిసై, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ వీక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకమైన సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నాయని, అవి తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని అన్నారు. అమ్మవారి దయతో రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉండాలన్నారు అనంతరం మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ బోనాల పండుగ లో పాల్గొన్న ప్రముఖులు, ముఖ్య అతిథులు, నాయకులను ఘనంగా సన్మానించారు. బోనాల పండుగలో ప్రజా ప్రతినిధులు, బీజేపీ జిల్లా నాయకులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజలు భారీగా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News