Sunday, July 7, 2024
HomeతెలంగాణPatancheru: ఉచిత కంప్యూటర్ కోర్సులు

Patancheru: ఉచిత కంప్యూటర్ కోర్సులు

ఫ్రీ కోర్స్ కోసం ఊశయ్య-8978064011, శ్రవణ్ కుమార్-9177378737 సంప్రదించండి

విద్యార్థులకు అందుబాటులో ఉచిత కంప్యూటర్ కోర్సులు అందిస్తామన్నారు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా కంప్యూటర్ కోర్సులు అందించబోతున్నట్లు పటాన్చెరు శాసనసభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇందుకు సంబంధించిన బ్రోచర్ ను ఆయన విడుదల చేశారు. జివిఆర్ ఫ్రీ స్కిల్స్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కార్యక్రమంలో భాగంగా సి, సి ప్లస్ ప్లస్, పైతాన్, జావా, వెబ్ టెక్ తదితర అంశాల్లో ఉచితంగా శిక్షణ అందిస్తామన్నారు.

- Advertisement -

తొలి విడతగా పటాన్చెరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రతిరోజూ సాయంత్రం ఉచితంగా క్లాసులు నిర్వహిస్తామన్నారు. పూర్తి వివరాల కోసం.. ఊశయ్య (8978064011), శ్రవణ్ కుమార్ (9177378737) లను సంప్రదించాలని కోరారు. ఈ సదవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News