Sunday, November 16, 2025
HomeతెలంగాణPatancheru: చాకరిమెట్ల ఆంజనేయ స్వామి సేవలో నీలం మధు

Patancheru: చాకరిమెట్ల ఆంజనేయ స్వామి సేవలో నీలం మధు

ఆధ్యాత్మికంగా ప్రసిద్ధి చెందిన చాకరిమెట్ల

నర్సాపూర్ నియోజకవర్గంలో ఆధ్యాత్మికంగా ప్రసిద్ధి చెందిన చాకరిమెట్ల సహకార ఆంజనేయ స్వామి వారిని మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్, మాజీ ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు, మదన్ రెడ్డి, డిసిసి అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, ఇంచార్జ్ ఆవుల రాజీరెడ్డితో కలిసి దర్శించుకున్నారు.

- Advertisement -

శ్రీ మాధవానంద సరస్వతి స్వామి వారి ఆదేశానుసారం ఆలయంలో నిర్వహించిన మహారుద్రం, సహస్ర శ్రీ సూక్తం, సహస్ర మన్యు సూక్తం, పురుష సూక్తం, లక్ష తమలార్చన, శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతం పూజలు అంగరంగ వైభవంగా జరిగాయి.

ఈ ప్రత్యేక పూజలలో నీలం మధు పాల్గొని స్వామి వారి సేవలో పాల్గొన్నారు. అనంతరం నీలం మధు మాట్లాడుతూ చాకరిమెట్ల సహకార ఆంజనేయ స్వామి ఆశీస్సులతో మెదక్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ గుప్తా, కమల పుల్ సింగ్,మండల అధ్యక్షులు మల్లేష్,సుదర్శన్ గౌడ్,మాజీ ఎంపీపీ లాలిత, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad