Wednesday, May 21, 2025
HomeతెలంగాణPatancheru: దివ్యాంగులకు దిక్సూచి ఎమ్మెల్యే జిఎంఆర్

Patancheru: దివ్యాంగులకు దిక్సూచి ఎమ్మెల్యే జిఎంఆర్

సమాజంలో అత్యంత వివక్షకు, అపహాస్యాలకు, అవమానాలకు, అన్యాయాలకు, పీడనకు గురవుతున్న దివ్యాంగులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దిక్సూచిగా మారారు.  గడప దాటాలంటే మరొకరి సహాయం కావలసిన దుస్థితి నుండి సొంతంగా తమ సొంత వాహనంపై వెళ్లేలా అండగా నిలిచారు ఎమ్మెల్యే జిఎంఆర్.  పటాన్చెరువు పట్టణంలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో.. 250 మంది దివ్యాంగులకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు చేతులమీదుగా పంపిణీ చేశారు.  

- Advertisement -

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమాజంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఏ కార్యక్రమం చేపట్టిన సంచలనమేనని  అన్నారు. దివ్యాంగుల కోసం మూడు కోట్ల రూపాయలతో 250 ద్విచక్ర వాహనాలు పంపిణీ చేయడం సంతోషకరంగా ఉందన్నారు. ప్రజలందరూ ఎమ్మెల్యే జీఎంఆర్ ను గుండెల నిండా ఆశీర్వదించాలని కోరారు. ఒకవైపు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలుపుతూ మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాలతో పేద ప్రజలకు అండగా నిలుస్తున్నారని కితాబునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ మంజు శ్రీ జయపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు,  దివ్యాంగులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News