Friday, September 20, 2024
HomeతెలంగాణPatancheru: ప్రగతి పథంలో పటాన్చెరు పల్లెలు

Patancheru: ప్రగతి పథంలో పటాన్చెరు పల్లెలు

పటాన్చెరు నియోజకవర్గంలోని గ్రామాలను ప్రభుత్వం అందించే నిధులతో పాటు సిఎస్సార్ నిధులతో ప్రగతికి ప్రతీకలుగా తీర్చిదిద్దుతున్నామని పటాన్చెరు శాసనసభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు మండలం పాశమైలారం గ్రామంలో జివిఆర్ ఎంటర్ప్రైజెస్ సౌజన్యంతో 2 కోట్ల 50 లక్షల రూపాయలతో పాశమైలారం నుండి నందిగామ మీదుగా క్యాసారం వరకు నిర్మించిన రోడ్డు, రిట్జ్ ఇండియా పరిశ్రమ సహకారంతో 5 లక్షల 25 వేల రూపాయలతో ఏర్పాటుచేసిన వీధి దీపాలు, 18 లక్షలతో నిర్మించిన బీటీ రోడ్డును స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో తీవ్ర వివక్షతకు, నిర్లక్ష్యానికి గురైన గ్రామీణ ప్రాంతాలు. నేడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రగతికి ప్రతీకలుగా నిలుస్తున్నాయని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు కోట్ల రూపాయలు నిధులు వెచ్చిస్తున్నామని తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు జాతీయస్థాయిలో గుర్తింపు పొందుతున్నాయని తెలిపారు. గ్రామాల మధ్య అంతర్గత రహదారులు, బ్రిడ్జిలు నిర్మించడ మూలంగా మెరుగైన రహదారి సౌకర్యం లభించడంతోపాటు శరవేగంగా అభివృద్ధి కొనసాగుతోందని అన్నారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములైనప్పుడే వాటికి సార్థకత చేకూరుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, గ్రామ ఇన్చార్జి సర్పంచ్ మోటే కృష్ణ యాదవ్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు పాండు, గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News