స్థానిక గిరిజన మ్యూజియంలో TSPCB ఎగ్జిబిషన్ స్టాల్ వెదురు, చెక్క పదార్థం, మట్టి, కాగితంతో తయారు చేయబడిన వివిధ రకాల ఉత్పత్తులను ప్రదర్శిస్తుంది, టూత్ బ్రష్‌లు, ఇయర్ బడ్స్, పెన్నులు, గ్లాసెస్, ప్లేట్లు, కేక్ కటింగ్ కత్తులు, మట్టితో చేసిన టీకప్పులు యాత్రికులు, ప్రజలకు ప్లాస్టిక్ ల హానికరమైన ప్రభావాల గురించి అవగాహన కల్పించడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌లకు ప్రత్యామ్నాయాలు ప్రదర్శించబడుతున్నాయి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌తో తయారైన ఉత్పత్తులను వాడడం మానేసి, రోజువారీ జీవితంలో మట్టి చెక్క, కాగితం, వెదురుతో తయారు చేసిన సహజ ఉత్పత్తులను స్వీకరించాలని, ఇది ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని కాపాడుతుందని ప్రజలకు పిలుపునిచ్చారు. మానవ, జంతువుల ఆరోగ్యం, గాలి, నీటి కాలుష్యంపై సింగిల్యూజ్ ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే ప్రభావాలపై యాత్రికులకు అవగాహన కల్పిస్తూ జాతర స్థలంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడతాయి. మేడారంలోని సమ్మక్క సారలమ్మ జాతరలో ఈ అవగాహన కార్యక్రమాలలో PCB సిబ్బంది, అధికారులు పాల్గొని ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు.