Saturday, October 5, 2024
Homeతెలంగాణదివ్యాంగులకు పెన్షన్ అందజేత

దివ్యాంగులకు పెన్షన్ అందజేత

ఎమ్మెల్యే నడిపెల్లి చేతుల మీదుగా పెరిగిన పెన్షన్..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు అందిస్తున్న 3 వేల 16 రూపాయల ఆసరా పెన్షన్ను 4 వేల 16 కు పెంచి దివ్యాంగులకు బాసటగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. బుధవారం జిల్లాలోని నస్పూర్ లోగల సమీకృత జిల్లా శాఖల కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు బి.రాహుల్, మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి.శేషాద్రి లతో కలిసి దివ్యాంగుల ఆసరా పెన్షన్ లబ్దిదారులకు పెరిగిన పెన్షన్ సంబంధిత ప్రొసీడింగ్స్ అందజేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు బాసటగా నిలిచి అందిస్తున్న 3 వేల 16 రూపాయల ఆసరా పెన్షన్ను మంచిర్యాల జిల్లా వేదికగా 4 వేల 16 రూపాయలకు పెంచుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిన నేపథ్యంలో సంబంధిత ప్రొసీడింగ్స్న లబ్దిదారులకు అందిస్తారన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో ప్రస్తుతం దాదాపు 1.5 కోట్ల రూపాయలు అందిస్తామని, పెరిగిన పెన్షన్తో దాదాపు 2 కోట్ల రూపాయలు ప్రతి నెల లబ్దిదారులకు అందిస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా 12 వేల 336 మందికి ప్రతి నెల ఒక్కొక్కరికి 4 వేల 16 రూపాయల ఆసరా పెన్షన్ ఇస్తామన్నారు.

మంచిర్యాల నియోజకవర్గ పరిధిలోని దండేపల్లి మండలంలో 978 మంది, హాజీపూర్ మండలంలో 588 మంది, లక్షెట్టిపేట మండలంలో 647 మంది, లక్షెట్టిపేట మున్సిపల్ పరిధిలో 300 మంది, మంచిర్యాల మున్సిపల్ పరిధిలో 1వేయి 407 మంది, నస్పూర్లో 784 మంది మొత్తంగా 4 వేల 704 మంది లబ్దిదారులకు పెరిగిన పెన్షన్ అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం ద్వారా పొందిన పెన్షనన్ను పిల్లల చదువులకు, గృహ అవసరాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, దివ్యాంగుల ఆసరా పెన్షన్ లబ్దిదారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News