పోచంపల్లి మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా 11వ వార్డు ప్రగతి నగర్, కేకే వీధి మరియు 6వ వార్డు రాంనగర్ కాలనీలలో పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటూ వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా సిసి రోడ్డు పనులు, అండర్ డ్రైనేజీ పనులను పరిశీలించారు. అనంతరం
పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొని నూతనంగా 42 మంది లబ్ధిదారులకు వృద్ధాప్య పింఛన్ సాంక్షన్ ప్రోసీడింగ్ లెటర్స్ ని అందజేశారు.
బి ఆర్ ఎస్ పార్టీలో చేరికలు:
పోచంపల్లి మండలం పిల్లాయిపల్లి గ్రామంలో నూతనంగా 40 లక్షల వ్యయంతో వేసిన సీసీ రోడ్డు ప్రారంభించి అనంతరం గ్రామంలో వాడ వాడ తిరుగుతూ ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి. అనంతరం జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నుండి 100 మంది ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మడుగుల ప్రభాకర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ కందాడి భూపాల్ రెడ్డి ఎంపీడీవో బాలకిషన్ పోచంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ చిట్టిపోలు విజయలక్ష్మి శ్రీనివాస్ వైస్ చైర్మన్ బాత్క లింగస్వామి కౌన్సిలర్లు కర్నాటి రవీందర్, గుండు మధు, కుడికాల అఖిలబలరాం వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు ఎంపీటీసీలు వార్డ్ మెంబర్లు బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.