Monday, July 8, 2024
HomeతెలంగాణTandur: తాండూరులో కారు స్పీడ్

Tandur: తాండూరులో కారు స్పీడ్

ఓ రేంజ్ లో పైలెట్ పాదయాత్ర

తాండూరు ప్రజల ఆశీర్వాదంతో బంపర్ మెజారిటీతో గెలవబోతున్నానని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. తాండూరు పట్టణంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా పాత తాండూరులో కోటేశ్వర దేవాలయంలో పూజలు నిర్వహించి వార్డులో పాదయాత్రను ప్రారంభించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ప్రచారంలో తాండూరు ప్రజలు చూపిస్తున్న ఆదరణ, ఆశీర్వాదాలతో బంపర్ మెజారిటీతో గెలవబోతున్నానని ధీమా వ్యక్తం చేశారు. పాదయాత్రలో బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, సీనియర్ నాయకులతో పాటు ప్రతీ కార్యకర్త స్థానిక ప్రజలు వేల సంఖ్యలో రావడం చూస్తుంటే ఇది ఎన్నికల ప్రచారంలాగా కాకుండా విజయోత్సవ ర్యాలీని తలపిస్తుందని సంతోషం వ్యక్తం చేశారు.

అడుగడుగునా ఘన స్వాగతాలు.. గులాబీ జెండాలతో తాండూరు పట్టణమంతా నిండిపోవడం చూస్తుంటే గెలుపు ఖాయమైపోయిందని ఇక భారీ మెజారిటీతో తాండూరు సత్తా చూపిద్దామన్నారు. ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంతో ఉత్తేజంతో బీఆర్ఎస్ పార్టీకి స్వాగతం పలుకుతూ మన పథకాలే నిదర్శనమన్నారు. మనం తెలంగాణ సాధించిన కేవలం 10 ఏళ్లలోనే దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచామన్నారు. తెలంగాణలో ఏ గడప చూసినా కేసీఆర్ ఫలాలు అందుతున్నాయని ఎవ్వరూ కూడా మరిచిపోవద్దని తెలిపారు. గత ప్రభుత్వాలలో మన పరిస్థితి ఎలా ఉండే.. మన తాండూరు ఎలా ఉండేనో ప్రతి ఒక్కరూ గమనించాలి. తాండూరు అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యం. కాంగ్రెస్ పార్టీ అబద్దపు మాయమాటలు చెప్పి కర్ణాటకలో గెలిచిన కాంగ్రెస్ ను దుమ్మెత్తిపోస్తున్నారు. కర్ణాటక ప్రజలు ఎంతో ఆవేదనతో ఆందోళనలు చేస్తున్నారు. కాబట్టి తాండూరు ప్రజలు మీరంతా గమనించాలి.

కాంగ్రెస్ మాయ మాటల మేనిఫేస్టోని నమ్మి మోసపోవద్దు. బీఆర్ఎస్ సంచలన మేనిఫెస్టోకి ఓటేద్దాం. చరిత్రలో ఎవ్వరూ చేయలేని అభివృద్ధిని మన తాండూరులో నేను చేసి చూపించాను. మరొక్కసారి నన్ను మీ బిడ్డగా ఆశీర్వదించి తాండూరులో గెలిపించండి. ఇంతకుమించి రెట్టింపు అభివృద్ధిని చేసి చూపిస్తానని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News