Wednesday, October 30, 2024
HomeతెలంగాణPilot Rohit Reddy: చత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకోవాలి

Pilot Rohit Reddy: చత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకోవాలి

ఓడినా ప్రజలపై ప్రేమ తగ్గని నేత

బషీరాబాద్ మండలం నీళ్లపల్లి, గొట్టుగా ఖుర్దు, కంసాన్పల్లి, గ్రామాల్లో చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన విగ్రహ దాత తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి. ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి మాట్లాడుతూ… చత్రపతి శివాజీ ఆదర్శంగా తీసుకోవాలి, భావితరాలకు మహనీయుల చరిత్ర తెలియజేయలన్న సమున్నత లక్ష్యంతో నియోజకవర్గ పరిధిలో శివాజీ విగ్రహాలను ఏర్పాటు చేశామన్నారు. కులమతాలకు అతీతంగా ప్రజలకు నిస్వార్థ వ్యక్తిత్వం నేటితరం ఆదర్శంగా తీసుకోవాలని అంటూ ఆయన ఆశలకు అనుగుణంగా అందరూ అన్నదమ్ముల కలిసిమెలిసి ఉండి గ్రామాల అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.

- Advertisement -

నీళ్లపల్లి యువ నాయకులు మాట్లాడుతూ రోహిత్ అన్నా నీవు ఓడిపోయిన గెలిచిన అంతే ఆనందం ఉంది మీకు ప్రజలపై ప్రేమ తగ్గలేదు అని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు ఎం నర్సిరెడ్డి, బిఏ నరసింహులు, శ్రీనివాస్ చారి, మాజీ సర్పంచ్ సువర్ణ ముకుంద్, గ్రామ పెద్దలు రుక్మారెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, గోపాల్ రెడ్డి, హరీశ్వర్ రెడ్డి, జగన్నాథ్ రెడ్డి, శివా, యూత్ సభ్యులు ఏకాంబరి టి హనుమంతు, పీకే రాజు, రాములు, గొట్టుగా కురుదు శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, నగేష్, శివాజీ యూత్ సభ్యులు నరేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News