Friday, September 20, 2024
HomeతెలంగాణPochampalli: కొండా లక్ష్మణ్ బాపూజీ 108వ జయంతి

Pochampalli: కొండా లక్ష్మణ్ బాపూజీ 108వ జయంతి

పోచంపల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

తెలంగాణ తొలి మరియు మలి దశ పోరాటంలో అలుపెరుగని పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ 108వ జయంతి వేడుకల్లో భాగంగా భూదాన్ పోచంపల్లిలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాల్లో ప్రముకుడైన వ్యక్తి అని 1915 సెప్టెంబర్ సెప్టెంబర్27 న కొమురం భీమ్ జిల్లా వాంకిడి గ్రామంలో జన్మించాడని 1952 లో అసిఫాబాద్ నుండి శాసనసభ్యునిగా ఎన్నికై హైదరాబాద్, ఆంద్రప్రదేశ్ శాసనసభలకు ప్రాతినిధ్యం వహించాడని 1969 లో మంత్రిగా ఉండి తొలి దశ తెలంగాణ ఉద్యమంలో తన మంత్రి పదవిని కుడా వదిలేసి పోరాడిన వ్యక్తి అని తెలంగాణ రాష్ట్ర చేనేత సహకార రంగానికి కూడా కృషిచేశారని అన్నారు. ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అడుగుజాడల్లో నడవాలని అన్నారు.

- Advertisement -

దోబీ ఘాట్ కి శంకుస్థాపన:
అనంతరం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మున్సిపల్ కేంద్రంలో రజకుల కోసం నిర్మించే అధునాతన దోబిగాట్ పనులకి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. సుమారు రెండు కోట్ల రూపాయల నిధులతో ప్రారంభించే ఈ దోబిఘాట్ మూలాన అధునాతన సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో పాటు రజకులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ చిట్టిపోలు విజయలక్ష్మి శ్రీనివాస్, వైస్ చైర్మన్ బాత్క లింగస్వామి, పిఎసిఎస్ చైర్మన్ కందాడి భూపాల్ రెడ్డి, టై అండ్ డై అసోసియేషన్ అధ్యక్షుడు తడక రమేష్, కౌన్సిలర్లు కర్నాటి రవీందర్, గుండు మధు, సామల మల్లారెడ్డి,దేవరాయకుమార్, పెద్దల చక్రపాణి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దొడ్డమోని చంద్రం యాదవ్, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పాటి సుధాకర్ రెడ్డి, కార్యదర్శి సిలువేరు బాల నరసింహ, పట్టణ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు సీత వెంకటేష్, ప్రధాన కార్యదర్శి గునిగంటి మల్లేష్ గౌడ్, ఉపాధ్యక్షుడు చేరాల నరసింహ, జింకల యాదగిరి మండల పార్టీ నాయకులు బత్తుల శ్రీశైలం గౌడ్, చింతకింది కిరణ్, సీత శ్రవణ్ రజక సంఘం నాయకులు ఇబ్రహీంపట్నం రమేష్, ఇబ్రహీంపట్నం అంజయ్య, చేరాల లింగయ్య, చేరాల ప్రకాష్, రాంచర్ల ప్రభాకర్, గోర్కంటి రాజు, చేరాల లింగస్వామి, చేరాల కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News