Monday, July 15, 2024
HomeతెలంగాణPocharam: స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి జన్మదినం

Pocharam: స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి జన్మదినం

రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని సీఎం కేసిఆర్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. స్పీకర్ ఛాంబర్ లోకి స్వయంగా వచ్చిన కేసీఆర్ పోచారంకు పుష్పగుచ్ఛాన్ని ఇచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, కేటీఆర్, హరీష్ రావుతోపాటు పోచారంకు శుభాకాంక్షలు తెలిపారు మంత్రులు, సభ్యులు. సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శాసనసభ భవనంలోని చాంబర్ లో ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో పలువురు మంత్రులు పాల్గొన్నారు.

- Advertisement -

తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రముఖులంతా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. అసెంబ్లీలోని తన చాంబర్ లో పుష్పగుచ్ఛం అందజేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News