నేను భయపడే వాడినే అయితే అధికార పార్టీ నుండి బయటకు వచ్చే వాణ్ణి కాదని, బీజేపీలోనే చేరేవాడినంటూ స్పష్టం చేశారు పొంగులేటి శ్రీనివాస రెడ్డి. గురువారం జరిగిన ఐటి దాడులు 30 ప్రాంతాలలో 400 మంది రైడ్ జరగ్గా రెండోరోజు రైడ్స్ కొనసాగాయన్నారు. కాంగ్రెస్ సీపీఐ పార్టీ ల పోత్తులో ఎన్నికలకు పోతున్నట్టు.. కమ్యూనిస్టులతో కలిసి తన సొంత ఆఫీస్ లోనే జాయింట్ ప్రెస్ మీట్ పెట్టిన శీనన్న.. కొత్తగూడెం నుండి కూనంనేని సాంబశివరావు పోటీలో ఉన్నారని, కూనంనేని గెలుపుకు కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ , స్టేట్ ఎలక్షన్ కమిషన్ అధికారంలో ఉన్న వాళ్లను ప్రొటెక్ట్ చేస్తున్నారా అనే సందేహం కలుగుతోందన్న ఆయన.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో స్ట్రాంగ్ గా ఉన్నందునే ఈ దాడులు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ-బీఆర్ఎస్ రెండు పార్టీలు డు ఫెవికాల్ పార్టీలు కాబట్టి కలిసి పనిచేస్తున్నాయని ఆయన ఆరోపించారు.
మా ఇంట్లో నిన్న రైడ్ చేస్తే వారికి దొరికింది ఏమి లేదని, నా అల్లుడిని ఇబ్బంది పెట్టి భయబ్రాంతులకు గురి చేసి అరెస్టు చేస్తామని బెదిరించారన్నారు. రాఘవ కన్స్ట్రక్షన్ మేనేజర్ జయ ప్రకాష్ పై థర్డ్ డిగ్రీ ఉపయోగించారని, ఒంటి కాలు మీద కుర్చీలో అర్థ గంట నిలబెట్టారన్నారు.
Ponguleti: భయపడేవాణ్ణి అయితే పార్టీ నుంచి బయటికొచ్చేవాణ్ణి కాదు
ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుందనే నాపై దాడులు