Monday, November 17, 2025
HomeతెలంగాణPonnam @ Sammakka Sarakka: వన దేవతలను దర్శించుకున్న మంత్రి పొన్నం

Ponnam @ Sammakka Sarakka: వన దేవతలను దర్శించుకున్న మంత్రి పొన్నం

-ఎత్తు బంగారం, పసుపు, కుంకుమ సమర్పించుకున్న మంత్రి

ముల్కనూర్ సమ్మక్క-సారలమ్మను రాష్ట్ర బీసీ, రవాణా శాఖమంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. కోయ పూజారులు డోలు వాయిద్యాలతో మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పొన్నం ఎత్తు బంగారం,పసుపు, కుంకుమను వనదేవతలకు సమర్పించుకున్నారు.

- Advertisement -

పొన్నం మాట్లాడుతూ.. రాబోయే కాలంలో మంచి వర్షాలు పడి రైతులు అన్ని వర్గాల వారు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నా అని అన్నారు. కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వంలో ఇచ్చినటువంటి హామీలు ఎటువంటి ఆటంకం లేకుండా అన్ని అమలై ప్రజలందరికీ లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వానికి మార్గదర్శనమిచ్చి ఆశీర్వదించాలని అమ్మవారిని కోరారు.

ఈ కార్యక్రమంలో ఈవో కిషన్ రావు జాతర చైర్మన్ మాడుగుల వీరస్వామి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad