ప్రగతిభవన్ ఎట్టకేలకు ప్రజాభవన్ గా మారింది. హైదరాబాద్ నగర బొడ్డున ఉన్న ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్ ను ప్రజా భవన్ గా మార్చేందుకు అవసరమైన అన్ని చర్యలు శరవేగంగా పూర్తవుతున్నాయి. ఎన్నికల్లో విజయం అనంతరం తొలి మీడియా సమావేశంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించినట్టే ప్రగతిభవన్ ను ప్రజాభవన్ గా మార్చేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కూడా తొలగించటంతో పాటు రోడ్డు మీద ఉన్న బ్యారికేడ్లను పెకిలించేశారు. గత పది సంవత్సరాలుగా ఇక్కడ ఎన్నో ఆంక్షలు అమలులో ఉన్నాయి.
రేపే ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటించారు. అమరవీరుల ఆకాంక్షలను పూర్తి చేస్తామంటూ రేవంత్ సీఎంగా చేసిన తొలి ప్రసంగంలో పేర్కొన్నారు. మేం పాలకులం కాదు సేవకులం అంటూ రేవంత్ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. విద్యార్థి, నిరుద్యోగ, అమరుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని రేవంత్ వెల్లడించారు. సీఎంగా రేవంత్ చేసిన ప్రసంగం తెలంగాణ ప్రజల మనోభీష్టాలను ప్రతిబింబించేలా ఆద్యంతం సాగింది.