ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుండి బి.ఆర్.ఎస్ లోకి శంషాబాద్ మండల్ హామీదుల్లా నగర్ గ్రామ సర్పంచ్ వట్టల సతీష్ యాదవ్ మండల పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు దేవులపల్లి శ్రీనివాస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు గడ్డం అశోక్ యాదవ్ ఉపసర్పంచ్ యాదగిరి మాధవి యాదగిరి వార్డు సభ్యుడు మంచర్ల సురేందర్ నాయకుడు మల్లేష్ గార్ల ఆధ్వర్యంలో 50 మంది యువకులు ఎమ్మెల్యే టి.ప్రకాష్ గౌడ్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పార్టీలో చేరిన వారందరికీ సముచిత స్థానం ఉంటుందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజలు విసిగిపోతున్నారని పేర్కొన్నారు. బీజేపీ మతం, కులం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయన్నారు. ప్రతి గడపకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న పథకాలు చేరుతున్నాయన్నారు. రాజకీయాలకతీతంగా పనులు చేస్తున్నామన్నారు. బీఆర్‌ఎస్ పార్టీలో పాత కొత్త తేడా లేకుండా సమన్వయంతో పనిచేసి పార్టీని తిరుగులేని శక్తిగా ఎదగడానికి అందరూ కంకణబద్దులై పనిచేయాలన్నారు. పార్టీలో చేరినవారు మల్లికార్జున యాదవ్, భాను ప్రసాద్, చారి, రాము యాదవ్ ,వెంకటేష్ ముదిరాజ్, వడ్డే రాజు, ఎండి కలీం, రమణారెడ్డి, బిక్షపతి, ఉమేష్, శ్రీకాంత్, నవీన్, ఆనంద్ ,అజయ్, భరత్ ,వెంగళ మహేష్, మహేందర్, ఉదయ్ కుమార్ ,సకల మహేందర్, రాజు యాదవ్ కార్తీక్ దేవలపల్లి శ్రీకాంత్ చాకలి కుమార్ ,రమేష్ ,కావాలి జగన్ ,నరసింహ తో పాటు 30 మంది యువకులు తదితరులు పార్టీలో చేరారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కే చంద్రారెడ్డి, ఎంపీపీ దిద్యాల జయమ్మ శ్రీనివాస్, సీనియర్ నాయకుడు నీరటి రాజు, ప్యాక్స్ చైర్మన్ బొమ్మ దవనకర్ గౌడ్, పార్టీ ప్రధాన కార్యదర్శి మంచర్ల మోహన్ రావు, యూత్ అధ్యక్షులు రాజశేఖర్ గౌడ్ ప్రధాన కార్యదర్శి సుధాకర్ గౌడ్, సత్యానందం శ్రీనివాస్ రెడ్డి బోర్డు లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.