Sunday, November 16, 2025
HomeతెలంగాణDraupadi Murmu: హైదరాబాద్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన.. ఇదే షెడ్యూల్

Draupadi Murmu: హైదరాబాద్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన.. ఇదే షెడ్యూల్

Draupadi Murmu| భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్(Hyderabad) పర్యటనకు రానున్నారు. రెండు రోజుల పాటు ఆమె హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారిక షెడ్యూల్ ఖరారైంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రాజ్ భవన్ చేరుకుంటారు. 6.20 గంటల నుంచి 7.10 గంటలకు అక్కడ విశ్రాంతి తీసుకుంటారు.

- Advertisement -

అనంతరం రాత్రి 7.20 గంటలకు ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే కోటి దిపోత్సవంలో పాల్గొంటారు. రాత్రికి రాజ్ భవన్‌లోనే బస చేయనున్నారు. ఇక రేపు ఉదయం 10.20 గంటలకు శిల్పకళా వేదికలో లోక్‌మంథన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12.05 గంటలకు బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీకి తిరుగుపయనం అవుతారు. మరోవైపు రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఇవాళ, రేపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad