Saturday, April 12, 2025
HomeతెలంగాణPuttaparthi: ప్రజా సంక్షేమమే టిడిపి మేనిఫెస్టో

Puttaparthi: ప్రజా సంక్షేమమే టిడిపి మేనిఫెస్టో

తాగు నీరు తోటకు మళ్లించిన ఎమ్మెల్యే

ప్రజా సంక్షేమమే టిడిపి మేనిఫెస్టో అని పుట్టపర్తి నియోజకవర్గ టిడిపి ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రాంతంలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమెకు స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలికి పూల వర్షం కురిపిస్తూ అపూర్వ స్వాగతం పలికారు.

- Advertisement -

ఈ సందర్భంగా పల్లె సింధూర మాట్లాడుతూ, రాష్ట్రంలో అరాచక పాలనకు స్వస్తి పలికేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే ఏపీ అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ప్రజల భవిష్యత్తు కోసం చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలో వైసిపి పాలనలో ప్రజలకు జరిగిన అభివృద్ధి శూన్యం అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి స్వంత లాభం కోసం తప్ప ప్రజలకు పనిచేసింది ఏమి లేదన్నారు.

ప్రజలకు సరఫరా కావాల్సిన త్రాగునీటిని కూడా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి స్వంత తోటకు మళ్లించి పంటను కాపాడుకున్నాడని ఆమె ఆరోపించారు. ప్రజలను ఎండ బెట్టాడని, ప్రజల సంక్షేమం కోసం పాటుపడే పార్టీ తెలుగుదేశం అన్నారు. ప్రజల సంక్షేమం కోసం పాటుపడే వ్యక్తి చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు. ప్రజలకు సుపరిపాలన కావాలంటే టిడిపి సైకిల్ గుర్తుకు ఓటు వేసి పుట్టపర్తి నియోజకవర్గ టిడిపి ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి, హిందూపురం పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పార్థసారథినీ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News