Friday, April 4, 2025
HomeతెలంగాణRaghunath Foundation Charity: ఫ్రీ స్కూలు బ్యాగ్స్ పంపిణీ చేసిన రఘునాథ్ ఫౌండేషన్

Raghunath Foundation Charity: ఫ్రీ స్కూలు బ్యాగ్స్ పంపిణీ చేసిన రఘునాథ్ ఫౌండేషన్

క్లాస్ రూంలు సందర్శించి స్టూడెంట్స్ తో యువనేత ముచ్చట్లు

శేరిలింగం పల్లి నియోజవర్గంలో యువనేత మారబోయిన రఘునాథ్ యాదవ్ ఆధ్వర్యంలో రఘునాథ్ ఫౌండేషన్ తరఫున ఉచిత స్కూలు బ్యాగుల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. గచ్చిబౌలిలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు రఘునాథ్ యాదవ్. ఈ సందర్భంగా విద్యార్థులందరికీ స్కూలు బ్యాగులను ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం క్లాసు రూములను సందర్శించి విద్యార్థులతో కాసేపు సరదాగా ముచ్చటించారు. వారి చదువుల గురించి ఆరా తీశారు. ఉపాధ్యాయులు ఎలా బోధిస్తున్నారంటూ అడిగి తెలుసుకున్నారు. చదువుతో పాటు క్రమశిక్షణ చాలా ముఖ్యమని తెలిపారు. టీచర్లు చెప్పే పాఠాలను శ్రద్ధగా వినాలని సూచించారు. రాబోయే భవిష్యత్తు అంతా మీదేనని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్య అనేది మనిషికి ఒక ఆభరణంలాంటిదనీ, అది మంచి గౌరవాన్ని సాధించి పెడుతుందని తెలిపారు. చదువుకొని ఉన్నత ఉద్యోగాలు చేయాలనీ, సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దుకోవాలని సూచించారు.

- Advertisement -

ఆర్థిక వనరులు లేవనీ, తగిన సౌకర్యాలు లేవనీ ఎవరూ చదువును మధ్యలో వదిలేయకూడదని చెప్పారు. భవిష్యత్తులో ఉన్నత చదువులకు తన వంతుగా సాయం అందిస్తానని రఘునాథ్ యాదవ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట్, కుమార్ సాగర్, రాములు గౌడ్, భరత్, శ్రీకాంత్ నాయక్, పవన్, సాయిలు, కాజా సాగర్, ఉదయ్, రఘునాథ్ ఫౌండేషన్ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News