Saturday, November 15, 2025
HomeతెలంగాణTG Weather Updates: మధ్యాహ్నం వరకే ఎండలు.. సాయంత్రం నుంచి మళ్ళీ వర్షాలు..!

TG Weather Updates: మధ్యాహ్నం వరకే ఎండలు.. సాయంత్రం నుంచి మళ్ళీ వర్షాలు..!

Today Rain In TG: ఈరోజు తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు, మధ్య, దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సాయంత్రం వేళల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇక ఉత్తర, పశ్చిమ తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో మధ్యాహ్నం వేళల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. హైదరాబాద్ నగరం విషయానికొస్తే.. మధ్యాహ్నం వేళల్లో ఒకటి లేదా రెండు రౌండ్లు భారీ వర్షాలు కురుస్తాయన్నారు. నిన్న ఊహించినట్లుగానే, దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో మంచి వర్షపాతం నమోదైందని అన్నారు. నేడు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు.

- Advertisement -

నేడు వాతావరణం లో కాస్త వేడి ఎక్కువగా ఉంటుందన్నారు వాతావరణ శాఖ అధికారులు. మధ్యాహ్నం వరకు ఎండ కొనసాగిన సాయంకాలం వరకు ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని అన్నారు. హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారుల ముందుగా చెప్పినట్టుగానే నిన్న సాయంకాలం నుండే రాష్ట్రంలోని పలు చోట్ల వర్షాలు ప్రారంభం అయ్యాయని చెప్పుకొచ్చారు. గత కొన్ని వారాలుగా రాష్ట్రంలో చెప్పుకోదగ్గ వర్షాలు లేవన్న విషయం మీకు తెలిసిందే. వర్షాలు పడాల్సిన సమయంలో మాన్ సూన్ కు బ్రేక్ పడటం కాస్త నిరాశకు గురి చేసిందనే చెప్పాలి. అయితే వాతావరణ శాఖ అధికారులు సూచించినట్లే నేటి మళ్ళీ భారీ వర్షాలు కురుస్తాయని ప్రస్తుత వాతావరణ పరిస్థితులు చూసి చెప్పవచ్చు.

గడిచిన 24 గంటల్లో:

గడిచిన 24 గంటల్లో దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాలైన.. నల్గొండ, నాగర్ కర్నూల్, సూర్యాపేట, సిద్ధిపేట, జనగాం, ఖమ్మం, భద్రాద్రి – కొత్తగూడెం, మహబూబ్ నగర్, నారాయణ పేట ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసాయి. యాదాద్రి అంతటా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసాయి. –

హైదరాబాద్ లో నిన్న రాత్రి నుండి నేటి ఉదయం వరకు చెల్లాచెదురుగా వర్షాలు పడ్డాయి.

హైదరాబాద్ లో:

నగరంలోని ఉప్పల్, కాప్రా, నాచారం, మల్లాపూర్, ఎల్‌బి నగర్, హయత్‌నగర్, వనస్థలిపురం, నాగోల్, బోడుప్పల్ లో భారీ వర్షాలు కురిసాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad