Saturday, June 29, 2024
HomeతెలంగాణRajanna Sirisilla: ఇసుక మాఫియాపై ఉక్కుపాదం

Rajanna Sirisilla: ఇసుక మాఫియాపై ఉక్కుపాదం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణాకు పాల్పడే వాహనాలను గుర్తించి జిల్లా పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపుతుంది. ఇసుక అక్రమ రవాణా చేసే వారిని గుర్తించి వారి వాహనాలు ను సీజ్ చేస్తామని పోలీసులు తెలిపారు.

- Advertisement -

ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ జిల్లాలో అక్రమ ఇసుక రవాణాలో రెండు సార్లకన్నా ఎక్కువ సార్లు వాహనాలు పట్టుపడితే ఆ వాహనాల జప్తు కోసం అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మైనింగ్ సిరిసిల్లకి అప్పగిస్తామన్నారు.

అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మైనింగ్ వారు ఆ వాహనాలు కోర్ట్ జప్తు చేసి ఆ వాహనాల మీద కోర్ట్ కఠిన చర్యలు తీసుకుంటుంది అన్నారు. వ్యవసాయ పనుల నిమిత్తం సబ్సిడీలో తీసుకున్న ట్రాక్టర్ లు వ్యవసాయ పనులు మినహా అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతూ పట్టుబడితే ఆ ట్రాక్టర్లు సీజ్ చేసి వాటి యొక్క సబ్సిడీ రద్దు చేయుట కోసం సిపార్సు చేశామన్నారు.

అక్రమ ఇసుక రవాణాను కట్టడి చేసే చర్యల్లో భాగంగా ముస్తాబాద్ , ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ల పరిధిలో 08 వాహనాలు గుర్తించి ఆ వాహనాలను సీజ్ చేసి, 12 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. జిల్లాలో అక్రమ ఇసుక రవాణాపై తరచు ప్రత్యేక తనిఖీలు నిర్వహించామన్నారు. జిల్లాలో 2024 సంవత్సరంలో అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్న వారిపై 163 మందిపై కేసులు నమోదు చేసి 161 వాహనాలు సీజ్ చేయడం జరిగిందని, తరచూ ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే వారిపై 14 కేసులల్లో 21 మందిని రిమాండ్ చేశామన్నారు.

అనుమతి లేకుండా అక్రమ ఇసుక రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకొని, ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని, ఇసుక రవాణాకు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని సంబంధం ఉన్న వ్యక్తులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే సంబంధిత పోలీసు అధికారులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News