ఉద్యోగ నిర్వహణలో అందించిన సేవలు శాశ్వత గుర్తింపు ఇస్తాయని రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ పేర్కొన్నారు. ఇద్దరు జిల్లా అధికారులు, నైట్ వాచ్ మన్ ఉద్యోగ విరమణ సందర్బంగా వారిని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో జిల్లా అధికారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు.
జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ మోహన్ రెడ్డి, ఆర్ అండ్ బీ ఈఈ శ్యాం సుందర్, కలెక్టరేట్ నైట్ వాచ్ మన్ నారాయణను అదనపు కలెక్టర్ సన్మానించి, వారి సేవలను కొనియాడారు. అనంతరం మాట్లాడుతూ ఉద్యోగుల తమ జీవిత కాలం వివిధ చోట్ల విధులు నిర్వర్తిస్తారని వివరించారు. ఆ సమయంలో ఉద్యోగులు అందించే సేవలు మంచి గుర్తింపు ఇస్తాయన్నారు. విరమణ పొందుతున్న వారు జిల్లా అభివృద్దిలో ఎంతో కృషి చేశారని కొనియాడారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు సేవలు అందించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో డిఓఏఆర్ఎస్ జిల్లా జనరల్ సెక్రటరీ వినోద్ కుమార్, ఆయా జిల్లా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.