Friday, November 22, 2024
HomeతెలంగాణRajanna Sirisilla: వాహనాల యజమానులు సరైన పత్రాలు చూపెట్టి వాహనాలను తీసుకెళ్ళవచ్చు

Rajanna Sirisilla: వాహనాల యజమానులు సరైన పత్రాలు చూపెట్టి వాహనాలను తీసుకెళ్ళవచ్చు

లేదా వేలం..

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు సందర్భాల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను, వివిధ సందర్భలలో సీజ్ చేయబడిన వాహనాలను వాహన యజమానులు 6 నెలలలోపు సరైన పత్రాలు చూపెట్టి వాహనాలను తీసుకెళ్ళవచ్చని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఒక ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్లలో పలు సందర్భాల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలు, యజమానులు తీసుకోకుండా ఉన్న వాహనాలు, గుర్తు తెలియని వాహనాలను జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి తరలించినట్లు తెలిపారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 55 (ఆటోలు 09,కార్స్ 02,సుమో 01, బైక్స్ 43) వాహనాలను ఉన్నాయని తెలిపారు. ఆరు నెలల వ్యవధిలో సరైన ధృవ పత్రాలను చూపించి తిరిగి తీసుకోవచ్చని, ఒకవేళ వాహన యజమానులు లేనియెడల వారి కుటుంబ సభ్యులు సరైన పత్రాలు చూపెట్టి తీసుకవేళ్ళచు అని, లేని పక్షంలో ప్రభుత్వ నిబంధనలను అనుసరించి 6 నెలల తరువాత వాహనాలను వేలం వేస్తామన్నారు.

వాహన యజమానులు సంబంధిత పత్రాలతో ఈ రోజు నుండి ఆరు నెలల లోపు తాడూర్ నందు గల పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో మోటార్ వెహికల్ సెక్షన్ నందు సంప్రదించాలని కోరారు. ఇతరత్రా సమాచారం కోసం 87126 56428 , 90009 10619 ఫోన్ నంబర్లలను సంప్రంచాలని తెలిపారు. వాహన యజమానులు 6 నెలలలోపు తీసుకుపోని వాహనాలకు వేలం వేస్తారని, ఈ వేలం 6 నెలల తరువాత నిర్వహించడం జరుగుతుందని, వేలం తేదీ ఎప్పుడు అనేది తెలియజేస్తామన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News