Sunday, July 7, 2024
HomeతెలంగాణRajanna Sirisilla: డ్రగ్ ఫ్రీ జిల్లాగా రాజన్న సిరిసిల్ల జిల్లా

Rajanna Sirisilla: డ్రగ్ ఫ్రీ జిల్లాగా రాజన్న సిరిసిల్ల జిల్లా

మెగా జాబ్ మేళ:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్

రాజన్న సిరిసిల్ల జిల్లాను డ్రగ్ ఫ్రీ జిల్లాగా తీర్చిదిద్దేందుకు జిల్లా పోలీసు శాఖ వినూత్న ఆలోచన చేసింది. ఈ మేరకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఒక ప్రకటన విడుదల చేశారు. విలాసాలకు అలవాటైన యువత దృష్టి మళ్లించేందుకు విన్నూత కార్యక్రమాలు చేపడుతున్నామని అందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో ఈ జూన్ నెల 13-06-2024 రోజున సిరిసిల్ల పట్టణ పరిధిలోని కల్యాణ లక్ష్మీ ఫంక్షన్ హాల్ లో సుమారు 60 కి పైగా కంపెనీల సహాయంతో 1000 పైగా ఉద్యోగ అవకాశాలతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని తెలిపారు.

- Advertisement -

జిల్లాలోని 10 వ తరగతి, ఇంటర్, ఎనీ డిగ్రీ , బి.టెక్ ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతి యువకులు క్రింద ఇవ్వబడిన లింక్ https://me-qr.com/z0s8PfJt లో తమ పేరు నమోదు చేసుకోవాలని తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు అందిపుచుకోవడానికి ఇది ఇక సువర్ణావకాశం అని ఎస్పీ అన్నారు. అనంతరం జాబ్ మేళాకి సంబంధించిన పోస్టర్ ని అధికారులతో కలసి ఆవిష్కరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News