కల్వకుర్తి నియోజకవర్గ బీ.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గుర్క జైపాల్ యాదవ్ తలకొండపల్లి మండలం ఖానాపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించి, ఇంటింటికీ ప్రచారం నిర్వహించి, భారీ బహిరంగ సభ నిర్వహించారు. అనంతరం వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, సమక్షంలో బీ.ఆర్.ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ వైస్ చైర్మన్, జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్, బీ.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు సీల్ శ్రీనివాస్ యాదవ్, ఎంపీపీ నిర్మల శ్రీశైలం గౌడ్, మార్కెట్ ఛైర్మెన్ శ్రీనివాస్ రెడ్డి, ప్యాస్ వైస్ చైర్మన్ రవి, ఎంపీటీసీ సరితా గణేష్ గుప్తా, మండల పార్టీ అధ్యక్షుడు. శంకర్, రైతు బంధు అధ్యక్షుడు పద్మ నర్సింహ, వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి, సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు గోపాల్ నాయక్, గ్రామ కమిటీ అధ్యక్షుడు నర్సింహ వివిధ గ్రామాల సర్పంచ్ లు, ప్రజాప్రతినిధులు, బీ.ఆర్.ఎస్ నాయకులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.