Saturday, November 23, 2024
HomeతెలంగాణRajendra Nagar: స్థానికులకు అవకాశం లేదా?

Rajendra Nagar: స్థానికులకు అవకాశం లేదా?

న్యాయ స్థానాలను ఆశ్రయిస్తామంటున్న స్థానికులు

రంగారెడ్డి జిల్లా మహిళ, శిశు, దివ్యాంగుల, వయోవృద్దుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బాలల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానంలో కేఎస్ వర్కర్, ఔట్రీచ్ వర్కర్, కౌన్సిలర్ లకు వేసిన నోటిఫికేషన్, ఉద్యోగాలలో రంగారెడ్డి జిల్లాకు చెందిన స్థానికులకు అవకాశం కల్పించాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. రంగారెడ్డి జిల్లా వాసులు వేరే జిల్లాలలో చుట్టుపక్కల ఉన్న జిల్లాలలో దరఖాస్తు చేసుకోగా, ఆ జిల్లాలో ఉన్న అధికారులు స్థానికులకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నామని తెలియజేశారు. రంగారెడ్డి జిల్లాలో జూన్ 16న సంక్షేమశాఖ వారు వేసిన నోటిఫికేషన్ లో స్థానికులను ఉద్యోగంలో తీసుకుంటామని పేర్కొన్నారు. అందుకు స్పందించి చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో దాదాపు చాలా రోజులనుండి పనిచేస్తున్న స్థానిక అభ్యర్థులు ఉన్నారు. పనిచేస్తున్న దరఖాస్తుదారులకు ఉద్యోగాలలో ప్రాధాన్యత కల్పించకుండా అనుభవం లేని వారికి, స్థానికేతరులకు అవకాశం కల్పించారని దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా సానికేతరులకు ఉద్యోగాలలో తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే కొందరు వ్యక్తులు “సమాచార హక్కు చట్టాన్ని” ఆశ్రయించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా స్థానికులకు అవకాశం కల్పించాలని వారు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News