మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఓం నమో శివాయ అంటూ శివ నామస్మరణలతో మార్మోగాయి. రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోని పెద్ద తుప్రా గ్రామంలో శివాలయం, శంషాబాద్ మండలం పెద్ద తుప్రా గ్రామంలో శివరాత్రి పర్వదినం సందర్బంగా లిమ్స్ హాస్పిటల్ ఎండి డాక్టర్ రాంరాజ్ సతీసమేతంగా శైవ క్షేత్రాలను దర్శించుకోవడంతో అర్చకులు ఘన స్వాగతం పలికారు. సతీ సమేతంగా స్వామివారికిి అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి అన్నదానంలో పాల్గొన్నారు.
డాక్టర్ దంపతులను ఆలయ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. గ్రామాలలోని దేవాలయాలలో తెల్లవారుజాము నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో శివాలయాలు చేరుకొని స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. శివరాత్రి సందర్భంగా ఆలయాలలో వేద పండితులు అభిషేకాలు, అర్చనలు, రుద్రాభిషేకాలు, శివపార్వతుల కళ్యాణం విశేష పూజలు చేశారు .భక్తులు ఉపవాస దీక్షలతో శివయ్యకు మొక్కులు తీర్చుకున్నారు. శైవ క్షేత్రాలు భక్తజనసంద్రంగా మారాయి. రాత్రి జాగరణ భక్తులు భజనలు చేశారు. ఆలయాల నిర్వాహకులు దేవాలయాలను విద్యుత్ దీపాలు ,మామిడి తోరణాలు, పూలదండలతో అత్యంత సుందరంగా అలంకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకున్నారు.