Friday, April 11, 2025
HomeతెలంగాణRam Reddy Sarvotham: అధికారం దక్కేది మాకే

Ram Reddy Sarvotham: అధికారం దక్కేది మాకే

ఏఐసీసీ సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని ఏఐసీసీ సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎలగబోయిన మధు ఆధ్వర్యంలో పార్టీ చెరికల సందర్భంగా మాట్లాడారు. టేకుమట్ల గ్రామం నుంచి 30 కుటుంబాలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిమానంతో చేరడం ఆనందంగా ఉందన్నారు. ఈ ఎన్నికలలో అధికార పార్టీ బిఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ విజయం కోసం అందరం కలిసికట్టుగా పనిచేసుకొని పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని, ఇదంతా కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన సంక్షేమ పథకాలే నిదర్శనమని తెలిపారు. అనంతరం పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో పసుపుల మల్లయ్య, ఎలుగురి వీరయ్య గౌడ్,శేఖర్, చిన్న మల్లయ్య, హుస్సేన్, సత్యం, బాలరాజు, నగేష్, శ్రీను, పాపయ్య, సీతారాములు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News