Sunday, November 16, 2025
HomeతెలంగాణRamadugu: ప్రభుత్వ స్కూల్ విద్యార్థికి ట్రిపుల్ ఐటీలో సీటు

Ramadugu: ప్రభుత్వ స్కూల్ విద్యార్థికి ట్రిపుల్ ఐటీలో సీటు

పదివేల రూపాయలు బహుకరణ

రామడుగు మండలం గుండి గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో పదవ తరగతి చదివిన జనగం రేష్మ 9.7 జిపిఏ తో ఉత్తీర్ణత సాధించింది. రేష్మ కు త్రిబుల్ ఐటీలో సీటు రావడంతో గుండి జడ్పీహెచ్ఎస్ స్కూల్లో ప్రధానోపాధ్యాయుడు భగవంతుని ఆధ్వర్యంలో విద్యార్థికి వారి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు ఉపాధ్యాయినీలు, ప్రజా ప్రతినిధులు ఘనంగా సన్మానం చేశారు.

- Advertisement -

పాఠశాలలో త్రిబుల్ ఐటీ సాధించిన రేష్మకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పదివేల రూపాయలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ గుండి మానస ప్రవీణ్, మాజీ ఎంపీటీసీ మడ్డి శ్యాంసుందర్ గౌడ్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ కొమురమ్మ , మాజీ స్కూల్ చైర్మన్ శ్రీనివాస్, ధోని తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad