Sunday, July 7, 2024
HomeతెలంగాణRamagundam: కమిషనరేట్ లో నిమజ్జన వేడుకలు

Ramagundam: కమిషనరేట్ లో నిమజ్జన వేడుకలు

వేడుకల్లో పాల్గొన్న సిపి రెమా రాజేశ్వరి

రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద పోలీస్ కమీషనర్ రెమా రాజేశ్వరి ఐపిఎస్ డిఐజి., మంచిర్యాల డీసీపీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఐపిఎస్., పెద్దపల్లి డీసీపీ వైభవ్ గైక్వాడ్ ఐపిఎస్., లతో కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని నిర్వహించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతరం హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో సీపీ స్వయంగా పోలీస్ అధికారులకు, సిబ్బందికి భోజనం వడ్డంచారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ… ఈ వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారని, ఎలాంటి విఘ్నాలు లేకుండా తాము మొదలు పెట్టిన పనులు పూర్తి అయ్యేటట్లు చూడాలని మహాగణపతిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలలో ఉన్న సోదరీ, సోదరభావం, ఐక్యత ఎంతో సంతోషాన్ని కల్గిస్తుందని, పోలీసు శాఖ సూచించిన మేరకు ఆయా మండపాల వద్ద యువత జాగ్రత్తలు తీసుకోవడం కనిపించిందని, ఇదేరీతిలో నిమజ్జనం రోజు వరకు ప్రతి ఒక్కరు పోలీస్ వారికి సహకరించాలని ఎటువంటి ఆటంకాలు లేకుండా నిమజ్జన శోభయాత్ర నిర్వహించుకోవాలని ప్రజలను సీపీ కోరారు.

- Advertisement -

అనంతరం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో గత ఆరు రోజులుగా విశేష పూజలు అందుకున్న గణనాథుని శోభయాత్రను సీపీ ప్రారంబించగా గణపతి దేవుని ప్రతిమను డప్పు వాయిద్యాలతో, పోలీస్ అధికారులు సిబ్బంది, పిల్లలు ప్రతిఒక్కరూ ఆనందోత్సవ నృత్యాలతో కోలాహలం మధ్య ఊరేగింపుగా తీసుకెళ్లి గోదావరి నదిలో నిమజ్జనం చేశారు.

ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసిపి తుల శ్రీనివాసరావు పెద్దపెల్లి ఏసిపి ఎడ్ల మహేష్, బెల్లంపల్లి ఏసిపి సదయ్య, జైపూర్ ఎసిపి మోహన్, టాస్క్ ఫోర్స్ ఏసిపి మల్లారెడ్డి, వెంకటేశ్వర్లు, ఏఆర్ ఏసీపీ మల్లికార్జున్, వివిధ విభాగల ఇన్స్పెక్టర్ లు, పెద్దపల్లి, మంచిర్యాల పరిధిలోనీ సీఐ లు ఆర్ఐలు దామోదర్, మల్లేశం,వామన మూర్తి, శ్రీధర్, విష్ణు ప్రసాద్, ఆర్ఎస్ఐ లు, స్పెషల్ పార్టీ సిబ్బంది, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News