Friday, November 22, 2024
HomeతెలంగాణRamagundam: కేసీఆర్‌ నాయకత్వంలో నెంబర్ వన్ గా రాష్ట్రం

Ramagundam: కేసీఆర్‌ నాయకత్వంలో నెంబర్ వన్ గా రాష్ట్రం

దేశంలో ఏ రంగంలోనైనా నెంబర్వన్ తెలంగాణ రాష్ట్రం

సిఎం కేసీఆర్‌ నాయకత్వంలో నెంబర్ వన్ గా తెలంగాణ రాష్ట్రం రామగుండం నియోజకవర్గం ఉద్యమ సమయం నుండి బిఆర్ఎస్ పార్టీకి అండగా ఒక శక్తిలాగా నిలిచిందని రామగుండం నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ను తిరిగి రెండవసారి భారీ మెజారిటీతో గులాబి సైనికులు గెలిపించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. ఎన్టీపీసీ లక్ష్మీ నరసింహ గార్డెన్ లో రామగుండం నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ సమావేశం మంత్రి కోప్పుల ఈశ్వర్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గం ఉద్యమ సమయంలో కెసిఆర్ ను బిఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచిందని అన్నారు. రామగుండం నియోజకవర్గం లో బిఆర్ఎస్ పార్టీ బలంగా తిరుగులేని రాజకీయ శక్తి గా ఉందన్నారు. రామగుండం నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోరుకంటి చందర్ ఉద్యమ నాయకుడు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే మంచి నాయకుడని చందర్ గెలవడం ఖాయమని గులాబి సైనికులంతా కలిసి భారీ మెజార్టీతో అందించాలని అన్నారు. రామగుండం లో గులాబీ జెండా ఎగురవేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రాష్ట్ర మంత్రివర్యులు కేటీఆర్ నాయకత్వంలో బ్రహ్మాండమైన ప్రగతి సాధించిందని అన్నారు. అన్ని రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రంగంలో ఆయన నెంబర్ వన్ గా నిలిచిందని దానికి కారణం కెసిఆర్ కెటీఆర్ అని అన్నారు. ప్రతిపక్షా పార్టీ నాయకుకు సోషల్ మీడియాలో బిఆర్ఎస్ పార్టీ దుర్మార్గమైన దుష్ప్రచారాలు ను గులాబీ సైనికులు తిప్పికొట్టాలని సూచించారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పాలనలో తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని వాళ్లు చేసేది కూడా ఏమీ లేదని అన్నారు.

- Advertisement -

కాంగ్రెస్ పదేళ్ల పాలనలో పదివేల ఉద్యోగాలు ఇస్తే సీఎం కేసీఆర్ తొమ్మిది సంవత్సరాల పాలనలో రెండు లక్షల 22వేల ఉద్యోగాలను సృష్టించి అందించాలని అన్నారు. ఐటిలో నాలుగు లక్షల కోట్ల పైచిలుకు పెట్టుబడులు హైదరాబాద్ రాష్ట్రానికి తీసుకువచ్చిన ఘనత తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు కేటీఆర్ అన్నారు. ఐటీ అంటేనే హైదరాబాద్ అని వ్యవసాయానికి కేరాఫ్ గా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని అన్నారు. గులాబీ సైనికులంతా రాబోవు ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోరుకంటి చందర్ ను బారీ మెాజార్టీతో గెలిపించాలన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News