బిఆర్ఎస్ నాయకులు అధికారం కోల్పోయి ఏం మాట్లాడుతున్నారో వారికే అర్ధంకావట్లేదని, తమ తప్పులని ఎమ్మెల్యేలపై రుద్దడం ఏంటని కాంగ్రెస్ నాయకులు డా. రామగళ్ళ పరమేశ్వర్ తీవ్రంగా ఖండించారు.
గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డా. రామగళ్ళ పరమేశ్వర్ మాట్లాడుతూ.. కెసిఆర్ కుటుంబం గత తొమ్మిది సంవత్సరాల పాటు అధికారంలో ఉండి లక్షల కోట్ల రూపాయలు అక్రమంగా దోచుకున్నారని ఆరోపించారు.
మీ పార్టీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నదనే విషయం నీకు తెలియదా, తెలిసి కూడా ఎందుకు మార్చలేదు, మారిస్తే నీ అవినీతి బయట పెడతారని భయంతో మార్చలేదన్నారు. బిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి, తెలంగాణ రాష్టాన్ని ఇచ్చిన తెలంగాణ తల్లి సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని ఆయన అన్నారు. తెలంగాణలో పదేళ్ళు అధికారంలో ఉన్న టీఆర్ఎస్, బీఆర్ఎస్ గా పేరు మార్చి దేశమంతటా విస్తరించాలని కలలుకన్న కేసీఆర్ చేసిన హంగులూ, ఆర్భాటాల కోసం విచ్చల విడిగా ఎన్నికల్లో డబ్బులు ఖర్చు చేశారని ఆయన ఆరోపించారు. మీ పార్టీలో కుళ్ళు రాజకీయాలు, అంతర్గత కుట్రలు, కుతంత్రాలు, అధిపత్య పోరుతో విసుగు చెంది ఒక్కొక్కరూ పార్టీని వదలి పోతున్నారని భగ్గుమన్నారు.
Ramalla Parameswar: బిఆర్ఎస్ ని కాంగ్రెస్ లో విలీనం చేయాలి
సోనియా గాంధీ రుణం తీర్చుకునేందుకు..