Friday, September 20, 2024
HomeతెలంగాణRamannapeta: సమస్యలు లేని పట్టణం

Ramannapeta: సమస్యలు లేని పట్టణం

బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ప్రగతి విప్లవం కొనసాగుతోందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. రామన్నపేట పట్టణ కేంద్రంలో సోమవారం నాడు 70 లక్షల వ్యయంతో పలు వార్డులలో సిసి రోడ్లు డ్రైనేజీ ,రూ.10 లక్షల వ్యయంతో స్థానిక బిసి కాలనీలో నిర్మించనున్న బుడగ జంగాల కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య రామన్నపేట పట్టణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఇప్పటికే సుమారు రెండు కోట్ల నిధులచే పట్టణాన్ని అభివృద్ధి చేశానని ఇంకా కొన్ని నిధులు తీసుకొచ్చి పట్టణాన్ని సమస్యలు లేని పట్టణంగా తీర్చిదిద్దుతానని తెలిపారు.
రామన్నపేట పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో గ్రామాలకు మహర్దశ వచ్చిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల చేతుల్లో నిరాదరణకు, నిర్లక్ష్యానికి గురైన అనేక గ్రామాలు టీఆర్ఎస్ పాలనలో క్రమక్రమంగా అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు.
అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారిందన్నారు. పట్టణ వాసులు ప్రజలందరూ కేసీఆర్ ప్రభుత్వానికి, బి ఆర్ ఎస్ పార్టీ కి అండగా నిలవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమాలలో ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి మదర్ డైరీ డైరెక్టర్ మందడి ప్రభాకర్ రెడ్డి టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మందడి ఉదయ్ రెడ్డి కార్యదర్శి పోషబోయిన మల్లేశం పట్టణ అధ్యక్షుడు పోతరాజు సాయి సర్పంచులు గుత్తా నర్సిరెడ్డి అప్పం లక్ష్మీనరసింహ ఎంపీటీసీలు గొరిగే నరసింహ ఎండి అమీర్ పొడిచేడు కిషన్ నాయకులు పున్న జగన్మోహన్ బందెల రాములు రామిని రమేష్ మాజీ వైస్ ఎంపీపీ బద్దుల ఉమా రమేష్ బత్తుల వెంకటేశం మీర్జా ఇనాయత్ బెగ్ జాడ సంతోష్ బొక్క పురుషోత్తం రెడ్డి ఆవుల నరేందర్ యాదవ్ వార్డు మెంబర్లు బడుగు రఘు బాలగోని శివ ఎండి నాజర్ లవణం రాధిక ఆవుల శ్రీధర్ గాదె శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News