భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పిలుపునిచ్చారు, శంకరపట్నం మండలం కరీంపేట గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ, స్మృతి వనం ప్రారంభించారు. ఈసందర్భంగా రసమయి బాలకిషన్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి గడపగడప కుచేరేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు ,రాజ్యాంగంలో పొందుపరిచిన ఓటు హక్కు కల్పించినటువంటి మహానేత బాబాసాహెబ్ అంబేద్కర్ ఐదేళ్లకు ఒకసారి ఓటు హక్కు ప్రజలకు గొప్ప ఆయుధాన్ని కల్పించినటువంటి గొప్ప మహనీయులన్నారు. అంబెడ్కర్ అనే వ్యక్తి కేవలం పేద వర్గాల కోసం , ఈ దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసి భారత రాజ్యాంగాన్ని పొందుపరిచారన్నారు.
అంబేద్కర్ తన కోసమే బ్రతికితే కేవలం తన ఊరిలో ఒక ఎంపీగాను ఉండేవారని ,చాలా కటిక పేదరికంలో పుట్టి చదువుకోడానికి నిరాశ పడలేదు కిటికీ పక్కన కూర్చొని చదువుకున్నాడని ,ఒక అంటరాని కుటుంబంలో పుట్టి ఒక నిరుపేద, దళిత కుటుంబంలో పుట్టిన వ్యక్తి అంబెడ్కర్ ఆన్నారు. మేదస్సు ఉన్నోని సొత్తు కాదని , అంబేద్కర్ అందరికీ ఒక స్ఫూర్తి భారత రాజ్యాంగ నిర్మాత అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ వచ్చిన తర్వాత రోల్ మోడల్ గా ఒక వెయ్యి గురుకుల పాఠశాలలు తీసుకువచ్చి పాఠశాలలో ఒక విద్యార్థికి ఒక లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారన్నారు. కళ్యాణ లక్ష్మి, రైతుబంధు రైతు బీమా దళిత బంధు అనేక సంక్షేమ పథకాలు అందజేస్తున్నామన్నారు. బిఆర్ఏస్ లో చేరికలు మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షులు గంట మైహిపాల్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలోకి వివిధ గ్రామాల కు చెందిన వారు బిఆర్ ఎస్ లో చేరగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి లింగంపల్లి శ్రీనివాసరెడ్డి వైస్ ఎంపీపీ పులి కోట రమేష్ మెరుగు శ్రీనివాస్ సర్పంచ్ వనపర్తి మల్లయ్య ఎంపిటిసి తిరుపతి క్యాదాసి భాస్కర్ మార్కెట్ వైస్ చైర్మన్ చౌడమల వీరస్వామి రాసమల శ్రీనివాస్ సతీష్ రెడ్డి సింగిల్ విండో చైర్మన్లు సర్పంచులు ఎంపిటిసిలు ఉప సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.