Monday, November 17, 2025
HomeతెలంగాణAurore Pharma | సూరారం ఫార్మా కంపెనీలో రియాక్టర్ బ్లాస్ట్

Aurore Pharma | సూరారం ఫార్మా కంపెనీలో రియాక్టర్ బ్లాస్ట్

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ పరిధిలోని సూరారం ఇండస్ట్రీ ఏరియాలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆరోర్ ఫార్మా (Aurore Pharma) కంపెనీలో రియాక్టర్ బ్లాస్ట్ అవడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో అనిల్(40) అనే కార్మికుడు మృతి చెందాడు. మరో ముగ్గురు కార్మికులు గోపి(23), శ్రీనివాస్(25), బలరామ్(30) లకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైడీలు వెల్లడించారు.

- Advertisement -

కాగా, ఆరోర్ ఫార్మా (Aurore Pharma) కంపెనీ లోని బాయిలర్ శుభ్రం చేస్తుండగా ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదం ఉదయం జరిగినా మృతుడి, బాధితుల కుటుంబాలకు సంస్థ నిర్వాహకులు సమాచారం ఇవ్వకపోవడంపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. సంస్థ ముందు మృతుడి బంధువులు నిరసనకు దిగారు. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. బాధితుల కుటుంబసభ్యుల ఆందోళనలతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad