Monday, November 17, 2025
HomeతెలంగాణTG Assembly: డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం

TG Assembly: డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం

డీలిమిటేషన్‌(Delimitation)కు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy) తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘డీలిమిటేషన్‌ వల్ల జనాభాను నియంత్రించిన రాష్ట్రాలు నష్టపోకూడదు. పునర్విభజనకు జనాభా ఒక్కటే ప్రమాణికం కాదు. రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని నియోజకవర్గాల పునర్విభజన చేయాలి. ప్రస్తుత జనాభాకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీలకు సీట్లు పెంచాలి. అన్ని పార్టీలతో సంప్రదింపులు జరిపాకే లోక్‌ సభ పునర్వీభజన చేయాలి” అని డిమాండ్ చేశారు.

- Advertisement -

ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలనే కొనసాగించాలి. అసెంబ్లీ నియోజకవర్గాలను 153కు పెంచాలి. జనాభా నియంత్రణపై కేంద్రం ఆదేశాలను దక్షిణాది రాష్ట్రాలు పాటించాయి. ఉత్తరాది రాష్ట్రాలు జనాభాను నియంత్రించలేదు. డీలిమిటేషన్‌ జరిగితే లోక్‌సభలో దక్షిణాదిరాష్ట్రాల ప్రాధాన్యత 19 శాతానికి పడిపోతుంది’’ అని రేవంత్‌ రెడ్డి తెలిపారు. కాగా డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా ఇటీవల చెన్నైలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి రేవంత్ హాజరైన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad