హైదరాబాద్‌లో విలువైన ప్రభుత్వ ఆస్తుల జాబితాను ప్రభుత్వానికి సమర్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్‌లో ఏవైనా ప్రారంభోత్సవాలు ఉంటే వారం రోజుల్లో పెట్టుకోవాలని అధికారులకు సీఎం సూచన చేయడం విశేషం. మెట్రో కొత్త మార్గాలకు త్వరలో శంకుస్థాపన వంటి పలు అంశాలపై నాలుగు గంటలకుపైగా ముఖ్యమంత్రి సమీక్ష సాగింది. ఈ సమీక్షలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉన్నతాధికారులు దాన కిషోర్, ఆమ్రపాలి తదితరులు పాల్గొన్నారు.