Wednesday, October 30, 2024
HomeతెలంగాణRoad Accident: 70 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు బోల్తా

Road Accident: 70 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు బోల్తా

- Advertisement -

Road Accident: వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. 70 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళా ప్రయాణికురాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరికొందరి ప్రయాణికులకు గాయాలవగా ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, స్థానికులు గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు.

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు ప్రాధమిక సమాచారం కాగా.. పోలీసులు ప్రమాదంపై విచారణ ప్రారంభించారు. ఇది వికారాబాద్ డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు కాగా తాండూరు నుంచి వికారాబాద్ కు వెళ్తుండగా.. అనంతగిరి ఘాట్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. బ్రేక్ ఫెయిల్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు రాగా విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News