Friday, April 4, 2025
HomeతెలంగాణRohit Reddy: రోహిత్ రెడ్డికి మళ్లీ షాక్, రోహిత్ చుట్టు బిగించిన ఉచ్చు

Rohit Reddy: రోహిత్ రెడ్డికి మళ్లీ షాక్, రోహిత్ చుట్టు బిగించిన ఉచ్చు

ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఈడీ దర్యాప్తుపై స్టే కు హైకోర్టు నిరాకరించటంతో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి పెద్ద షాక్ తగిలింది. ఈడీ విచారణ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న రోహిత్ రెడ్డి అభ్యర్థన తోసిపుచ్చిన హైకోర్టు, ఈనెల 30న హాజరు కావాలన్న ఈడీ సమన్లలో జోక్యానికి నిరాకరించింది. ఈడీ కేసు కొట్టివేయాలన్న ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పిటిషన్‌పై జస్టిస్ కె.లక్ష్మణ విచారణ జరిపారు. రోహిత్‌రెడ్డి తరఫున వైసీపీ ఎంపీ, సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు జరిపారు. పార్టీ మారాలని తనకు వందకోట్లు ఆఫర్ ఇచ్చారన్న రోహిత్‌రెడ్డి, ఆఫర్ మాత్రమే చేశారు కాని డబ్బు ఇవ్వలేదన్న రోహిత్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఆర్థిక లావాదేవీలు జరగలేదు కనుక ఈడీకి విచారణ పరిధి లేదని రోహిత్ రెడ్డి వాదిస్తున్నారు. ఈడీ ఈసీఐఆర్ మనీలాండరింగ్ చట్టానికి విరుద్ధమన్న రోహిత్‌రెడ్డి, వ్యక్తిగత వివరాల కోసం ఈడీ తనను వేధిస్తోందని రోహిత్‌రెడ్డి ఆరోపిస్తుండటం మనందరికీ తెలిసినదే. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించిన కోర్టు తదుపరి విచారణ జనవరి 5కు వాయిదావేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News