Tuesday, April 1, 2025
HomeతెలంగాణRSP: తెలంగాణ రాక్షస-రాబంధుల పాలన నడుస్తోంది: ప్రవీణ్‌ కుమార్

RSP: తెలంగాణ రాక్షస-రాబంధుల పాలన నడుస్తోంది: ప్రవీణ్‌ కుమార్

తెలంగాణలో రాక్షస-రాబంధుల పాలన నడుస్తోందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జైలులో ఉండాల్సిన వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా ఉన్నారని ధ్వజమెత్తారు. రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ రేవంత్ ధ్వంసం చేస్తున్నారని.. ప్రజల హక్కులను కాపాడాల్సిన సీఎం వాటిని హరిస్తున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల గొంతుకగా పోరాడటాన్ని రేవంత్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారని.. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిని టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు.

- Advertisement -

మార్చి 15, 16 తేదీలలో పదిహేను కేసులు పెట్టారని.. రీట్వీట్ చేసిన వారిపై కూడా కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. అశ్లీలత మీద పెట్టాల్సిన సెక్షన్ 67 ఐటీ యాక్ట్‌ని బీఆర్ఎస్ కార్యకర్తల మీద ప్రయోగించి కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు. రేవంత్ హోంమంత్రిగా సైబర్ సెక్యూరిటీ బ్యూరోను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. డిజిటల్ మోసాల నుంచి ప్రజలను రక్షించాల్సిన ఆ బ్యూరోను రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ సోషల్ మీడియాపై ప్రయోగిస్తున్నారని ఆరోపణలు చేశార. సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు కొందరూ రేవంత్ రెడ్డి తొత్తులుగా పనిచేస్తున్నారని ఆర్ఎస్పీ ఫైర్ అయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News