Saturday, February 22, 2025
HomeతెలంగాణTGRTC Strike:ఎన్నికల కోడ్ ముగిశాక ఆర్టీసీ సమ్మె సైరన్

TGRTC Strike:ఎన్నికల కోడ్ ముగిశాక ఆర్టీసీ సమ్మె సైరన్

ఎన్నికల కోడ్ (Election code) ముగిశాక ఆర్టీసీ సమ్మె సైరన్ మోగనుంది. తొలుత ఐదారు రోజులు సమ్మె ఆ తర్వాత నిరవధిక సమ్మెకు ప్రణాళిక సిద్ధం కానున్నట్లు ఆర్టీసీ సంఘాలు తెలిపాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా యాజమాన్యంతో చర్చలు వాయిదా వేసినట్లు తెలిపింది.

- Advertisement -

తెలంగాణ రాష్ట్ర సర్కారుకు గట్టి దెబ్బ తగలనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిశాక ఆర్టీసీ సమ్మెకు సైరన్ మోగనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా యాజమాన్యంతో చర్చలు వాయిదా వేశారు. ఈ క్రమంలోనే కోడ్ ముగిసే వరకు రేవంత్ సర్కారుకు కార్మికులు గడువు ఇచ్చారు. కోడ్ ముగియగానే మరో నోటీసు ఇవ్వాలని తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్ణయానికి వచ్చాయి.

ఇప్పటికే గత నెలలో ఆర్టీసీ సంఘాలు ఓ సమ్మె నోటీసును ఇచ్చాయి. తొలుత ఐదు, ఆరు రోజుల సమ్మె ఆ తర్వాత నిరవధిక సమ్మెకు కార్మికులు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. కార్మికుల సమస్యలు, ప్రభుత్వంలో విలీనం, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పీఆర్సీ వంటి పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమ్మె సైరన్ మోగించేందుకు సిద్దమైంది.

ప్రైవేటు సంస్థల పెత్తనంతో
ఆర్టీసీపై ప్రైవేటు సంస్థల పెత్తనానికి ఏర్పాట్లు చేయటంతో ఉద్యోగులు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆర్టీసీలో పెద్ద సంఖ్యలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టి వాటిని కాంట్రాక్టు పద్దతిలో ప్రవేటు సంస్థ నుంచి అద్దె తీసుకుంటుంది. ఈ బస్సుల నిర్వహణ కోసం కొన్ని డిపోలను సదరు సంస్థకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేయటంపై ఉద్యోగులు అసహానం వ్యక్తం చేస్తున్నారు. ఇక తెలంగాణ ఆర్టీసీలో ప్రైవైటీకరణకు మార్గం సులభం చేయటమేనని ఫైర్ అవుతున్నారు. దీంతో అధికారులు ఆలోచించి వెనక్కి తగ్గి ఈ ఎలక్ట్రికల్ బస్సులతో పాటు సాధారణ సొంత బస్సులు కూడా తిరుగుతాయని స్పష్టత ఇచ్చిన ఉద్యోగుల్లో అనుమానాలు తొలగిపోలేదు.

వీటితో మరిన్ని సమస్యలను కార్మిక సంఘాలు తెరపైకి తీసుకువచ్చి సమ్మె హారన్ మోగించనున్నారు. అంతేకాదు గత ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ప్రక్రియను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే అంతలోనే ప్రభుత్వం మారి కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రావటంతో ఆ ప్రక్రియను పెండింగ్ ఉంచింది. దీంతో గతంలో 2017 వేతన సవరణ బకాయిలు చెల్లించక పోగా 2021 వేతన సవరణపై ఈ ప్రభుత్వం స్పందించటమే లేదు. ఇంకా సీసీఎస్, పీఎఫ్(PF)లకు భారీగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. వీటిని కూడా కార్మికులు సాధించుకునేందుకు సమ్మెకు సిద్దమయ్యాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News