Friday, September 20, 2024
HomeతెలంగాణSaidireddy: ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా గురుకులాలు

Saidireddy: ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా గురుకులాలు

చిల్లేపల్లిలో బీసీ బాలికల గురుకుల పాఠశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

బీసీ గురుకులాలలో ప్రతి విద్యార్థికి లక్ష 50 వేల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి (సిటీ సెంటర్ స్కూల్) అద్దె భవనంలో గుడుగుంట్ల పాలెం బీసీ బాలికల గురుకుల పాఠశాలను ప్రారంభించారు. అంతకుముందు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యేకు ఉపాధ్యాయులు విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల కోసం ప్రభుత్వం ఎన్నో గురుకుల పాఠశాలను ప్రారంభించారని అన్నారు. ముఖ్యంగా పేద, మధ్య తరగతి విద్యార్థినీ విద్యార్థులకు గురుకులాల్లో చదవడం ఎంతో అదృష్టం అన్నారు. గురుకులాలలో పలు రకాల మెనూతో మంచి భోజనం అందించి, నాణ్యమైన విద్యను బోధిస్తున్నారని తెలిపారు. త్వరలోనే మూడు కోట్ల రూపాయల వ్యయంతో గుడుగుంట్ల పాలెంలో బీసీ బాలికల గురుకుల పాఠశాలను నిర్మించబోతున్నామని తెలిపారు. బీసీ గురుకులాలు అన్ని ప్రస్తుతం చిల్లేపల్లి కేంద్రంగానే కొనసాగుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు, అధికారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News