Sunday, July 7, 2024
HomeతెలంగాణSaidireddy: మళ్లీ అధికారం మాదే

Saidireddy: మళ్లీ అధికారం మాదే

100 మందికి టిఆర్ఎస్ లోకి ఆహ్వానం

3,500 కోట్ల రూపాయలతో హుజూర్నగర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరిగాయని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. నేరేడుచర్ల మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పెంచికల్ దిన్న గ్రామంలో 20 లక్షల నిధులతో నూతన గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం, 50 లక్షల వ్యయంతో డి ఎం ఎఫ్ టి,30 లక్షల రూపాయలు నిధులతో ఎంజిఎన్ఆర్ఇజిఎస్ మొత్తము 80 లక్షలతో తెలుగరామయ్య గూడెం రోడ్డు నిర్మాణం, 44 లక్షల నిధులతో పెంచికల్ దిన్నలో కాలువ బ్రిడ్జి నిర్మాణం, యల్లారం గ్రామంలో 20 లక్షల రూపాయల నిధులతో నూతన గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం, పూర్తి చేసి వారి చేతుల మీదుగా ప్రారంభం చేశారు.

- Advertisement -

అనంతరం ప్రతి సంవత్సరం తెలంగాణ ఆడపడుచులకు అందించే బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి, మహిళలకు బతుకమ్మ చీరలు అందించారు. కెసిఆర్ స్పోర్ట్స్ కిట్స్ ను యువతకు అందజేశారు. నేరేడుచర్ల మండలంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు సుమారు 100 మంది బిఆర్ఎస్ పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 40 ఏళ్లలో జరిగిన అభివృద్ధి కేవలం ఈ నాలుగేళ్లలో జరిగిందని అన్నారు.

గతంలో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధిని తాను ఎమ్మెల్యే అయిన తర్వాతనే హుజుర్ నగర్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడుస్తుందని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి వివిధ పార్టీలకు చెందిన సుమారు 100మంది పార్టీ లో చేరడం సంతోషంగా ఉందన్నారు. మూడువేల ఐదు వందల కోట్లకు పైనా నిధులతో హుజూర్ నగర్ నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతోందని అన్నారు. రానున్న ఎన్నికలలో మళ్ళీ బిఆర్ఎస్ పార్టీనే గెలిపించి, ప్రజలు బ్రహ్మరథం పడతారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News