Sammakka Sarakka CTU: సమ్మక్క – సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ లోగోను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో కలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. సమ్మక్క – సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ “జ్ఞానం పరమం ధ్యాయం” అనే నినాదంతో, ఇది అనువర్తిత, పరిశోధన, ఆవిష్కరణ-ఆధారిత విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చెందుతుందని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.
అత్యుత్తమ రీసెర్చ్ యూనివర్సిటీగా సమ్మక్క – సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ నిలుస్తుందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి ధర్మేంద్ర ప్రధాన్ సమ్మక్క – సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ లోగోను ఆయన ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. సాంస్కృతిక వారసత్వం, సంచార జాతుల ప్రజలు ఉండే ప్రాంతంలో ఈ ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Delighted to launch the logo of Sammakka Sarakka Central Tribal University along with Shri @kishanreddybjp ji.
The logo weaving together tribal and Sanskrit elements reinforces the institution’s role as a guardian of tribal heritage and knowledge and a beacon of educational… pic.twitter.com/MhNgSUFZ0Y
— Dharmendra Pradhan (@dpradhanbjp) October 7, 2025
సమ్మక్క – సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ద్వారా చాలా విషయాలు వెలుగులోకి తీసుకురావచ్చు.. తెలుగు, హిందీ, మరాఠీతో పాటు ప్రాంతీయ ట్రైబల్ భాషలను మెరుగు పరచవచ్చు. తెలంగాణలో ఈ ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆకాంక్ష. విద్యా సమానత్వం, గిరిజన సాధికారత దిశగా.. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చేందుకు కేంద్రం కృషి చేస్తోంది. విశ్వవిద్యాలయాలు ఆవిష్కరణ కేంద్రాలుగా ఉండాలి. త్వరలో సమ్మక్క- సారక్క యూనివర్సిటీని సందర్శించి కొత్త క్యాంపస్‌కి శంకుస్థాపన చేస్తాం.
కాగా, సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ లోగోను పరిశీలించినట్లయితే.. లోగో మధ్యలో గిరిజన దేవతల పసుపు బొమ్మలను ఏర్పాటుచేశారు. దేవతల కుంకుమను సూచించేలా మధ్యలో ఎర్రటి సూర్యుడి బొమ్మతో లోగోను తీర్చిదిద్దారు. ప్రశాంతమైన ఆధ్యాత్మిక కోణాన్ని జోడించే పీఠాలపై ఉన్న దైవిక ద్వయం.. గద్దెల చిహ్నాలను రూపొందించారు. గిరిజన దుస్తులు, సౌందర్యానికి అంతర్భాగంగా నెమలి ఈకలు.. సాంస్కృతిక గౌరవం, ధైర్యం, సంప్రదాయాన్ని సూచించే రెండు కోణాల జంతువుల కొమ్ములతో కూడిన కిరీటంతో లోగో రూపుదిద్దుకుంది. ఈ లోగో గిరిజన సంస్కృతికి అద్దం పడుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.


