గార్ల మండలం పరిధిలోని సీతంపేట గ్రామపంచాయతీలోని అంకన్న గూడెం గ్రామంలో గురువారం శ్రీ సమ్మక్క సారక్క గుడి పూజారి భూక్య బద్రు ఆధ్వర్యంలో సమ్మక్క సారక్క మినీ జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాకతీయుల కాలం నాటినుండి మేడారంలో చేస్తున్నటువంటి సాంప్రదాయ సంస్కృతి విశిష్టతను చాటి చెప్పేందుకు మినీ జాతరలో మొదటి రోజు ఊరేగింపుగా వనం నుండి సారక్కను గద్దె పైకి తీసుకొచ్చి పూజలు నిర్వహిస్తారు.
అదేవిధంగా రెండవ రోజు సమ్మక్కను శివశక్తుల కోలాటాలతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి వనం నుండి గద్దపైకి తీసుకొచ్చి సమ్మక్క సారక్క వనదేవతలను భక్తి శ్రద్ధతో పూజలు నిర్వహించి, మొదటి రోజు బోనాలను సమర్పించి, మూడు రోజులపాటు మినీ జాతరను ఘనంగా నిర్వహిస్తారు. ఈ పండుగను కన్నులారా చూడడానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి, కోరిన కోరికలను తీర్చే దేవతలకు తమ ఎత్తు బంగారం సమర్పించి, ఎదురించి కోళ్లను కోసి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు.
మూడు రోజులపాటు సాగిన జాతర తర్వాత వన దేవతలను పూజారి మేళ తాళాలతో ఊరేగింపుగా భక్తి పారవర్షంలో శివశక్తులతో కోలాట నృత్యాలతో వన దేవతలను వన ప్రవేశం చేస్తారు. ఈ కార్యక్రమంలో సమ్మక-సారక్క శివశక్తులు మంగ్యా, వెంకన్న, బాలు, లక్ష్మి, వాయిద్య కళాకారులు, వంగూరి వీరభద్రం, సందీప్, సిద్దు, ఉపేందర్, రణధీర్, రాకేష్, తేజ, భక్తులు పాల్గొన్నారు.