Friday, June 13, 2025
HomeతెలంగాణSandhya 35MM Theatre: సంధ్య థియేటర్ లో పాముల కలకలం

Sandhya 35MM Theatre: సంధ్య థియేటర్ లో పాముల కలకలం

Snakes In Sandhya Theater: ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ (35MM) టాయిలెట్స్ వద్ద తరచూ పాములు కనిపిస్తుండటంతో ప్రేక్షకులు, సిబ్బంది భయాందోళన చెందుతున్నారు. సినిమాకు వచ్చి హాయిగా ఎంజాయ్ చేద్దామనుకునే సమయంలో ఎక్కడ పాము కనిపిస్తుందోనన్న భయంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -


ఈ సమస్యను ప్రేక్షకులు, సిబ్బంది పదే పదే యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా వారు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిత్యం వందలాది మందితో కిటకిటలాడే ఈ ప్రాంతంలో ఎవరికైనా పాము కాటుకు గురైతే ఎవరు బాధ్యత వహిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. థియేటర్ యాజమాన్యం తక్షణమే స్పందించి ఈ పాముల బెడదను పరిష్కరించి ప్రేక్షకులకు పూర్తి భద్రత కల్పించాలని సినిమా ప్రియులు డిమాండ్ చేస్తున్నారు. నిర్లక్ష్యం కారణంగా ఏదైనా ప్రమాదం జరిగితే దానికి పూర్తి బాధ్యత థియేటర్ యాజమాన్యానిదేనని వారు హెచ్చరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News