Wednesday, October 30, 2024
HomeతెలంగాణSangareddy: మియాపూర్ నుండి సంగారెడ్డి వరకు మెట్రో

Sangareddy: మియాపూర్ నుండి సంగారెడ్డి వరకు మెట్రో

రానున్న రోజుల్లో బిజెపి హవా

సంగారెడ్డి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి గారి ఆధ్వర్యంలో పి ఎస్ ఆర్ ఫంక్షన్ హాల్ నిర్వహించిన అభినందన సభకు ముఖ్యఅతిథిగా నూతనంగా ఎంపీగా గెలుపొందిన మాధవనేని రఘునందన్ రావు హాజరైనారు.

- Advertisement -

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి భూత్ స్థాయి కార్యకర్త కృషి మరువలేనిది అని ప్రతి కార్యకర్త ఒక సైనికుడై పోరాట ప్రతిభ కనపర్చి బిజెపిని గెలిపించడం చాలా సంతోషకరమని ఈ విజయం కార్యకర్తల విజయం అని అదే విధంగా ఈ సమయస్ఫూర్తిని కొనసాగిస్తూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవాలని కార్యకర్తలకు సూచించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతులకు కిసాన్ సమ్మేళన పథకం కింద 20 వేల కోట్లు విడుదల చేసిన సందర్భంగా ఆయన చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం సంగారెడ్డి జిల్లా వీరశైవులు ఆ సంఘం తరఫున ఎంపీ రఘునందన్ రావును పూలమాలతో సన్మానించారు. సంగారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జ్ దేశ్పాండే బిజెపి నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి జిల్లా నాయకులు కోవూరి సంగన్న చంద్రశేఖర్ జగన్ టౌన్ అధ్యక్షులు ద్వారకా రవి కార్యదర్శి రాజు గౌడ్ పోచారం గ్రామంలో వాసు దోమల విజయ్ మందుల నాగరాజు ప్రసాద్ రవిశంకర్ మహిళా బిజెపి నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News