Friday, September 20, 2024
HomeతెలంగాణSasanka: ప్రగతిని వినూత్నంగా వివరించండి

Sasanka: ప్రగతిని వినూత్నంగా వివరించండి

తెలంగాణ రాష్టం సిద్ధించిన తర్వాత సాధించిన ప్రగతిని ప్రజలకు తెలిసేలా వినూత్నంగా కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. శనివారం ఐడిఓసి లోని కాన్ఫరెన్స్ హాల్లో జూన్ రెండవ తేదీ నుండి 22వ తేదీ వరకు 20 రోజులు పాటు సంబంధిత శాఖల తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ఘన కీర్తిని గ్రామ గ్రామాన కార్యక్రమాలలో నిర్వహించేందుకు ప్రణాళిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ఘన కీర్తిని గ్రామ గ్రామాన విస్తృత ప్రచారం చేపట్టేందుకు ప్రణాళిక బద్దంగా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
అందుకు అధికారులు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధించాక దశాబ్దికాలంగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని సంబంధిత శాఖలు తమ శాఖ పరిధిలో కార్యక్రమాలను రూపొందించుకొని ప్రజలకు అవగాహన కొరకు ప్రభుత్వం రూపొందించిన పోస్టర్లను కరపత్రాలను ప్రజలకు అందించాలన్నారు. సమావేశాలు ఏర్పాటు చేసి గతంలో ప్రభుత్వ అభివృద్ధి పనితీరును ప్రస్తుత అభివృద్ధి పనితీరును వివరంగా చెప్పాలన్నారు. జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని జూన్ మూడవ తేదీ నుండి 22వ తేదీ వరకు ప్రతిరోజు కార్యక్రమాలు నిర్వహించబడతాయన్నారు.
జూన్ మూడవ తేదీన తెలంగాణ రైతు దినోత్సవం నాలుగవ తేదీన పోలీస్ శాఖ వారి సురక్ష దినోత్సవం ఐదవ తేదీన తెలంగాణ విద్యుత్ విజయోత్సవం ఆరవ తేదీన పారిశ్రామిక ప్రగతి ఉత్సవం ఏడవ తేదీన సాగునీటి దినోత్సవం 8వ తేదీన ఊరూరా చెరువుల పండగ మత్స్యశాఖ దినోత్సవం 9వ తేదీన తెలంగాణ సంక్షేమ సంబురాలులో భాగంగా ఆసరా పెన్షన్లు కల్యాణ లక్ష్మి కార్యక్రమాలు పదో తేదీన ప్రభుత్వ సుపరిపాలన దినోత్సవం జిల్లాస్థాయిలో నిర్వహణ తీరును వివరిస్తారన్నారు. 11వ తేదీన తెలంగాణ సాహిత్య దినోత్సవం లో భాగంగా కవి సమ్మేళనం నిర్వహించడం సన్మానించుకోవడం జరుగుతుందన్నారు జూన్ 12వ తేదీన తెలంగాణ రన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుందని జూన్ 13వ తేదీన తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం నిర్వహిస్తామని అదేవిధంగా జూన్ 14వ తేదీన తెలంగాణ వైద్య ఆరోగ్య దినోత్సవం తో పాటు జూన్ 15 తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవం 16 తేదీన తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవం లను విద్యార్థులతో పలు కార్యక్రమాలు చేపట్టనున్నామన్నారు జూన్ 15వ తేదీన గ్రామపంచాయతీలలో జాతీయ పతాక ఆవిష్కరణ ఉంటుందన్నారు అలాగే 58 59 ప్రభుత్వ ఉత్తర్వుల క్రమబద్ధీకరణ కింద సిద్ధం చేసిన పట్టాలను పంపిణీ చేస్తారన్నారు.
సఫాయి అన్నా… సలాం అన్న ..అంటూ నినాదం వాడవాడలా మారుమరోగే విధంగా మున్సిపల్ గ్రామ పంచాయతీ అధికారులు విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు జూన్ 17వ తేదీన గిరిజన ఉత్సవం పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందని తండాలు గూడెంలలో కులాచార ప్రాతిపదికన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు గిరిజన ఉదాహరణకు కృషిచేసిన కొమరం భీమ్ సేవాలాల్ లకు పుష్పదళాలు సమర్పించడం జరుగుతుందన్నారు జూన్ 18వ తేదీన తెలంగాణ మంచినీళ్ల పండుగ కార్యక్రమం మిషన్ భగీరథ ఆధ్వర్యంలో మంచినీళ్ల పండగ నిర్వహించడం జరుగుతుందన్నారు జూన్ 19వ తేదీన తెలంగాణ హరితోత్సవం చేపట్టి వాడవాడలా మొక్కలు నాటడం జరుగుతుందన్నారు జూన్ 20వ తేదీన తెలంగాణ విద్యా దినోత్సవం అన్ని విద్యాసంస్థలతో నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా మన ఊరు మనబడి కార్యక్రమం కింద అభివృద్ధి పరిచిన పాఠశాలలను ప్రారంభించుకోవడం జరుగుతుందని విద్యార్థులకు ప్రభుత్వం మంజూరు చేసిన బుక్స్ యూనిఫామ్స్ పంపిణీ చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు జూన్ 21న ఆధ్యాత్మిక దినోత్సవం దేవదాయ శాఖ మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్నారు ప్రత్యేక ప్రార్థన కార్యక్రమాలు ఉంటాయని తెలియజేశారు దేవాలయం అనంతరం దేవాలయం లలో నిర్వహిస్తామన్నారు జూన్ 22వ తేదీన అమరవీరులకు సంస్మరణ కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రతి ఒక్కరూ మౌనం పాటించి నివాళులు అర్పించవలసి అవసరం ఉంటుందన్నారు.
ప్రతిరోజు సంబంధిత శాఖలు చేపట్టే కార్యక్రమాన్ని ముందుగా రూపొందించి ఇవ్వాలని అదేవిధంగా కార్యక్రమం అనంతరం చేపట్టిన విధానాన్ని కూడా నివేదిక రూపంలో తెలియజేయాలన్నారు.
ఈ సమావేశంలో ఎస్పి శరద్ చంద్ర పవార్,అదనపు కలెక్టర్లు అభిలాష అభినవ్ డేవిడ్ జడ్పీ సీఈవో రమాదేవి డిఆర్డిఏ పిడి సన్యాసయ్య ఆర్డీవోలు కొమరయ్య, రమేష్ జిల్లా అధికారులు మున్సిపల్ కమిషనర్లు తాసిల్దారులు ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News